![]() |
![]() |

బిగ్‌బాస్ సీజన్ 7లో పార్టిసిపేట్ చేసిన లేడీ కంటెస్టెంట్లలో శుభశ్రీ రాయగురు ఒకరు. ఈ బ్యూటీ హౌస్‌లో ఉన్నంత సేపు మిగిలిన కంటెస్టెంట్లకి టఫ్ ఫైట్ ఇచ్చింది. అయితే ఓట్లు పడలేదంటూ శుభశ్రీని ఎలిమినేట్ చేసేశారు. కానీ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత శుభశ్రీకి మంచి ఫేమ్ వచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో ఓ పాత్రలో శుభశ్రీ నటిస్తుంది.
ఒడిశాలో పుట్టిపెరిగిన ఆమె 2022లో వచ్చిన తెలుగు సినిమా రుద్రవీణ, తమిళ సినిమా డెవిల్ లతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఆ తరువాత 2023లో అమిగోస్, కథ వెనుక కథ వంటి పలు చిత్రాల్లోనూ ఆమె నటించింది. ముంబైలో ఎల్‌ఎల్‌బీ కోర్సు పూర్తి చేసిన శుభశ్రీ.. లాయర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయినప్పటికీ ఆమెకి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. అలా 2020లో వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా ఒడిశా విజేతగా నిలిచింది. తర్వాత టెలివిజన్ యాంకర్‌గా మారింది. హిందీ సినిమా మస్తీజాదే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా చేసింది. సీజన్ సెవెన్ లో లాయర్ కమ్ యాక్టర్ గా శుభశ్రీ అడుగుపెట్టింది. ఓ నామినేషన్ లో అమర్ దీప్ తో జరిగిన గొడవలో.. దమ్ముంటే నామినేషన్ పాయింట్ చెప్పు బ్రో.. మనోభావాలు దెబ్బతిన్నాయి ఏంటి అంటు క్యూట్ గా ఏడ్చేసింది శుభశ్రీ. దాంతో ఒక్కసారిగా ఇన్ స్టాగ్రామ్ లో ట్రోలర్స్ కి కంటెంట్ దొరికినట్టైంది. అప్పటినుండి శుభశ్రీని ట్రోల్స్ లో వాడుకుంటున్నారు మీమర్స్. ఇక బిగ్ బాస్ తర్వాత గౌతమ్ కృష్ణ, శివాజీ, ప్రశాంత్, యావర్ లని కలిసింది. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసిన శుభశ్రీ.. రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తోంది.
శుభశ్రీకి ఇన్ స్టాగ్రామ్ లో 615K ఫాలోవర్స్ ఉన్నారు. అందుకేనేమో తను ఏ పోస్ట్ చేసిన అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది. ఇక తాజాగా తను 'గల్ మేరీ మనిజ' అనే హిందీ పాటకు తను నడుస్తూ ఓ వీడియో బైట్ ని షేర్ చేసింది. అయితే ఇందులో రెడ్ వెల్వెట్ డ్రెస్ వేసుకొని అందాలు ఆరబోసింది. అయితే తను బాడీ మొత్తం కలిపి ఒక్కటే క్లాత్ ఉండటంతో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అవకాశాల కోసం ఎంత చేయాలో అంత చేస్తున్నారంటు ఒకరు కామెంట్ చేయగా.. కెజిఎఫ్ మూవీలోని ' బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెట్టుకున్నారు ' అని మరొకరు కామెంట్ చేశారు. ట్యాలెంట్ చూపిస్తున్నావేంటి సుబ్బు అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇలా శుభశ్రీ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.
![]() |
![]() |